sulakshana: తెలుగు సినిమాలు ఎక్కువగా చేయకపోవడానికి కారణమదే: సీనియర్ హీరోయిన్ సులక్షణ

  • 'శుభోదయం' ద్వారా పరిచయమయ్యాను 
  • చంద్రమోహన్ తోనే వరుస సినిమాలు
  • తమిళంలో బాగా బిజీ అయ్యాను       
తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయికగా సులక్షణ కనిపిస్తారు. తెలుగుతో పాటు ఆమె తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లోను నటించారు. అలాంటి సులక్షణ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

"తెలుగు తెరకు 'శుభోదయం' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమయ్యాను. ఆ తరువాత చంద్రమోహన్ సరసన కథానాయికగానే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలోనే కన్నడలో రాజ్ కుమార్ జోడీగా అవకాశం వచ్చింది. ఆ సినిమా చేసిన తరువాత తమిళంలో అవకాశం వచ్చింది. తమిళంలో కె.భాగ్యరాజా సరసన చేసిన సినిమా విజయవంతం కావడంతో అక్కడ బాగా బిజీ అయ్యాను. ఆ సమయంలో తెలుగు నుంచి అవకాశాలు వచ్చినా చేయలేని పరిస్థితి. అందువల్లనే నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను" అని ఆమె చెప్పుకొచ్చారు.     
sulakshana

More Telugu News