Paritala Sunita: హైదరాబాద్ చేరుకుని నేరుగా నందమూరి సుహాసిని ఇంటికి వెళ్లిన పరిటాల సునీత!

  • నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రచారం
  • కూకట్ పల్లిలోని పలు ప్రాంతాల్లో తిరగనున్న సునీత
  • ఆపై నందమూరి ఫ్యామిలీ రంగంలోకి!
నేటి నుంచి రెండు రోజులపాటు కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున బరిలోకి దిగిన నందమూరి సుహాసినితో కలసి ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆమె, నేరుగా నాంపల్లిలోని సుహాసిని ఇంటికి వెళ్లారు.

 ఆక్కడి నుంచి వీరు కూకట్ పల్లి చేరుకుని, కేపీహెచ్బీ కాలనీ, వివేక్ నగర్, వెంకట రమణ కాలనీ, శేషాద్రి కాలనీ, శాతవాహన నగర్, వివేకానంద నగర్, శాంతి నగర్, పాపారాయుడు నగర్, ఖుషీ నగర్ తదితర ప్రాంతాల్లో ఓటర్లను కలిసి, మహాకూటమికి ఓట్లు వేయాలని పరిటాల సునీత కోరనున్నారు. ఈ ప్రాంతంలో రాయలసీమ వాసులు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన వారు ఓటర్లుగా వేల సంఖ్యలో ఉండటంతో సునీత ప్రచారం సుహాసినికి కలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, వచ్చే నెల ఆరంభంలో నటుడు బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబమంతా సుహాసిని గెలుపు కోసం ప్రచారం చేయనుంది.
Paritala Sunita
Kukatpalli
Nandamuri Suhasini
Campaign

More Telugu News