Vivo Y95: అద్భుత ఫీచర్లతో 'వివో వై95' విడుదల.. రూ.1,500 క్యాష్ బ్యాక్ ప్రకటించిన పేటీఎం!

  • ధర రూ.16,990
  • స్టర్రీ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్లలో లభ్యం 
  • జియో వినియోగదారులకు రూ.4000 వరకు ప్రయోజనాలు

ప్రముఖ మొబైల్ దిగ్గజం వివో తాజాగా నూతన స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయెల్ కెమెరాలతో 'వివో వై95' పేరిట విడుదలైన ఈ ఫోన్ ధర రూ.16,990గా ఉంది. స్టర్రీ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్లలో లభించే ఈ ఫోన్ ఆఫ్‌ లైన్ స్టోర్లతో పాటు ఫ్లిప్‌ కార్ట్, అమెజాన్, పేటీఎం, వివో ఇండియా ఇ-స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. పేటీఎం ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1,500 క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాగే, జియో వినియోగదారులు రూ.4000 వరకు ప్రయోజనాలను పొందనున్నారు.

వివో వై95 ప్రత్యేకతలు:

  • 6.2" హెచ్‌డీ డిస్‌ప్లే (1520 x 720 పిక్సల్స్)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్
  • 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 13/2 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
  • 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 4030 ఎంఏహెచ్ బ్యాటరీ

  • Loading...

More Telugu News