Dasoju sravan: గన్‌మెన్‌ను వెనక్కి పంపిన దాసోజు శ్రవణ్.. తనకు ప్రజలే అండన్న ప్రజాకూటమి అభ్యర్థి

  • భద్రత సిబ్బందిని వెనక్కి పంపిన దాసోజు
  • ఖైరతాబాద్‌లో విస్తృత పర్యటన
  • దానం నాగేందర్, రామచంద్రారెడ్డిలను నమ్మవద్దన్న కాంగ్రెస్ నేత
ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి దాసోజు శ్రవణ్ తన గన్‌మెన్‌ను వెనక్కి పంపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న తనకు ప్రజలే అండ అని, భద్రతా సిబ్బంది తనకు అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు.

 ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన మాట్లాడుతూ..  బీజేపీ, టీఆర్ఎస్‌లను ప్రజలు విశ్వసించవద్దని కోరారు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ప్రజలను వంచించారని, ఆయనను, దానం నాగేందర్‌ను నమ్మవద్దని ఓటర్లను అభ్యర్థించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, వారి కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. పీజేఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నట్టు దాసోజు పేర్కొన్నారు.
Dasoju sravan
Congress
Danam Nagendar
Ramchandra reddy
BJP
TRS

More Telugu News