samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నెలాఖరు నుంచి సమంత కొత్త సినిమా
  • మహేశ్, సుకుమార్ చిత్రం అప్ డేట్స్ 
  • కాబోయే భర్త గురించి రాశిఖన్నా 
  • గీత రచయితగా మారిన కొరియోగ్రాఫర్

*  ప్రస్తుతం 'మజిలి' చిత్రంలో నటిస్తున్న కథానాయిక సమంత త్వరలో నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుంది. కొరియన్ చిత్రం 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభమవుతుంది. సురేశ్ బాబు దీనిని నిర్మిస్తారు.
*  మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందే చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలవుతుంది. ఈ చిత్రం కోసం మహేశ్ మే నెల నుంచి బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
*  తన పెళ్లి మరో రెండేళ్లలో ఉంటుందని కథానాయిక రాశిఖన్నా చెప్పింది. 'మరో రెండేళ్లలో మా వాళ్లు సంబంధాలు చూడడం మొదలుపెడతారు. నా మనస్తత్వానికి తగ్గా వ్యక్తినే చేసుకుంటాను. తను మంచి హృదయం కలవాడై వుండాలి' అని చెప్పింది. ఈ ముద్దుగుమ్మ త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా నటించే చిత్రంలో నటించనుంది.
*  కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో ప్రభుదేవా గీత రచయితగా కూడా మారాడు. తాను నటిస్తున్న 'చార్లీ చాప్లిన్ 2' చిత్రం కోసం ప్రభుదేవా ఓ పాటను రాశాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతంలో దీనిని రికార్డు చేశారు.

More Telugu News