mary kom: మేరీకోమ్ పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు

  • ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 6 స్వర్ణాలు గెలుపొందిన మేరీకోమ్
  • చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేసిన మహేష్
  • అద్భుతమైన విజయమంటూ కితాబు

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ మేరీకోమ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరోసారి స్వర్ణ పతకాన్ని సాధించి... ఆ ఘనతను సాధించిన తొలి మహిళా బాక్సర్ గా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఈ నేపథ్యంలో, ఆమెపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మేరీకోమ్ విజయం సాధించడం గర్వంగా ఉందని మహేష్ ట్వీట్ చేశాడు. 'అద్భుతమైన విజయం. ఛాంపియన్... నీ విజయాన్ని చూసి గర్విస్తున్నాము. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆరు స్వర్ణాలను గెలుపొందినందుకు అభినందనలు.'

35 ఏళ్ల మేరీకోమ్ రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆమెను భారత రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు.

  • Loading...

More Telugu News