KCR: బస్సు ప్రమాదం గుర్తుందా కేసీఆర్‌గారూ...నాడు కరీంనగర్‌ రాలేదేం?: పొన్నం ప్రభాకర్‌ విసుర్లు

  • ఇప్పుడు ఓట్లు కావాల్సి రావడంతో ప్రజల అవసరమొచ్చిందా
  • అరవై మంది చనిపోతే ఆరోజు పలకరించడం బాధ్యత అనిపించలేదా
  • ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశాక ఓట్లు అడగండి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ ఇప్పుడు తగుదునమ్మా అని ఓట్ల వేట కోసం వస్తున్న కేసీఆర్‌కు కొండగట్టు బస్సు ప్రమాదం రోజున కరంనగర్‌ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఘోర ప్రమాదంలో అరవై మంది ప్రాణాలు కోల్పోతే కనీసం  ఆ కుటుంబాలను పలకరించాలని మీకు అనిపించలేదా? అన్నారు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని కరీంనగర్‌ ప్రజలను ఓట్లు అడుగుతారన్నారు. కేసీఆర్‌ గంట సేపు కరీంనగర్‌ రోడ్లపై తిరగ గలిగితే తాను పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ ప్రజలకు ఏయే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ ముందు అమలు చేసి ఆ తర్వాత ఇక్కడి ప్రజలను కేసీఆర్‌ ఓట్లు అడగాలని కోరారు.

More Telugu News