Telangana: చేవెళ్లలో ‘కె’ రాజకీయం.. పోటీ చేస్తున్న అభ్యర్థులందరి ఇంటిపేర్లు ఒకే అక్షరంతో మొదలు!

  • తెలంగాణ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి
  • చేవెళ్లలో 9 మంది అభ్యర్థుల పోటీ
  • నలుగురు మొయినాద్ కు చెందినవారే

ఎన్నికలు సమీపించే వేళ చిత్రవిచిత్రాలకు కొదవుండదు. తాజాగా తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గంలో ఇలాంటి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరి పేర్లు ‘కె’ అక్షరంతో మొదలవుతాయి. ఇక్కడ మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య, కాంగ్రెస్ అభ్యర్థి కేెఎస్ రత్నం, బీజేపీ అభ్యర్థి కంచర్ల ప్రకాశ్, బీఎస్పీ అభ్యర్థి కర్రె సునీల్ కుమార్ ఇలా 9 మంది అభ్యర్థుల ఇంటిపేర్లు ‘కె’ అనే అక్షరంతో మొదలవుతున్నాయి. అలాగే చేవెళ్ల బరిలో ఉన్న తొమ్మిది మంది అభ్యర్థుల్లో నలుగురు మొయినాబాద్ మండలానికి చెందినవారే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News