Andhra Pradesh: జగన్, పవన్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందంటూ పార్టీని వీడిన వెలగపూడి

  • ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండలేనన్న వెలగపూడి
  • పార్టీకి స్థలం ఇచ్చిన తొలి వ్యక్తిని తానేనన్న నేత
  • కన్నాకు రాజీనామా లేఖ

వైసీపీ, జనసేన పార్టీలకు బీజేపీ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎంత కష్టపడినా పార్టీలో తనకు ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ రాసిన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పంపారు. జగన్, పవన్‌లకు మద్దతు ఇస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదని అందులో ఆరోపించారు.

గత ఎన్నికలకు ముందే తాను బీజేపీలో చేరానని పేర్కొన్న వెలగపూడి.. విజయవాడ సమీపంలోని నిడమానూరులో పార్టీకి వెయ్యి గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన ఇంట్లో జరిగిన సమావేశంలో పార్టీ కీలక కమిటీల్లో తనను చేరుస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని కన్నాను నిలదీశారు . తాను విరాళంగా ఇచ్చిన స్థలంపై తుది నిర్ణయం పార్టీదేనని, బీజేపీ ఖాతా వివరాలను పంపితే రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన రూ. 50 వేలను తిరిగి పంపిస్తానని  వెలగపూడి స్పష్టం చేశారు.

More Telugu News