nama nageswar rao: నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన రేణుకా చౌదరి

  • కారు పార్టీ ఒక బేకారు పార్టీ
  • అవకాశవాదంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు
  • మోదీతో కేసీఆర్ కు రహస్య ఒప్పందం ఉంది
తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని, ప్రధాని మోదీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న కారు పార్టీ... ఒక బేకారు పార్టీ అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీని, తెలంగాణలో కేసీఆర్ ను ఇంటికి పంపుతామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు.

అవకాశవాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. రాహుల్ గాంధీతో కలసి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల వరకు కూడా మహాకూటమి కొనసాగుతుందని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తాము చేస్తున్న పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరపున ఈరోజు ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
nama nageswar rao
renuka chowdary
Chandrababu
Rahul Gandhi
kcr

More Telugu News