apoorva: ఎమ్మెల్యే చింతమనేని మాకు నరకం చూపిస్తున్నారు: సినీ నటి అపూర్వ

  • తాము మొదటి నుంచి టీడీపీనే
  • ఓటు వేసి గెలిపించిన చింతమనేని నరకం చూపిస్తున్నారు
  • అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల సినిమాలకు దూరంగా ఉన్నా
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సినీ నటి అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేశారు. చింతమనేని తమకు నరకం చూపిస్తున్నారని... మరోసారి ఆయన ఎమ్మెల్యే అయితే, ఇక్కడున్న తమ ఆస్తులను అమ్ముకుని, తెలంగాణకు వెళ్లిపోతామని చెప్పారు.

తాము కూడా కమ్మ సామాజికవర్గమే అయినప్పటికీ... తమకు కులపిచ్చి లేదని తెలిపారు. మొదటి నుంచి తాము టీడీపీకే ఓటు వేస్తున్నామని.. గత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలని దేవుడిని కూడా ప్రార్థించానని చెప్పారు. తాము ఓట్లు వేసి గెలిపించిన చింతమనేనే ఇప్పుడు తమకు నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈమేరకు స్పందించారు.

తన తల్లి గుండె జబ్బుతో బాధపడుతున్నారని... ఆమె బాగోగులు చూసుకుంటుండటం వల్ల సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, నటించడం లేదని అపూర్వ చెప్పారు. అమ్మ ఆరోగ్యం బాగుపడిన తర్వాత మళ్లీ నటిస్తానని తెలిపారు.
apoorva
actress
tollywood
Chinthamaneni Prabhakar
denduluru

More Telugu News