modi: చివరకు మా అమ్మను కూడా రాజకీయ బురదలోకి లాగారు: మోదీ

  • నన్ను ఎదుర్కొనే దమ్ము లేక.. మా అమ్మను విమర్శిస్తున్నారు
  • నాతో పోరాడటంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు
  • కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చూడండి
తనను ఎదుర్కొనే దమ్ము లేక... చివరకు తన తల్లిని కూడా రాజకీయ బురదలోకి లాగుతోందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. వేలెత్తి చూపడానికి ఏమీ లేకపోవడంతో... ఇతరుల తల్లిని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీతో పోరాడటంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారని అన్నారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తూ, మోదీ పైవ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చూడాలని పిలుపునిచ్చారు.

నిన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మాట్లాడుతూ, మోదీపై విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు భారత రూపాయి విలువ ప్రధాని వయసుకు సమానంగా పతనమైందని విమర్శించేవారని అన్నారు. ఇప్పుడు మన కరెన్సీ విలువ మోదీ తల్లి వయసుకు చేరువవుతోందని విమర్శించారు. మోదీ తల్లి హీరాబెన్ వయసు 97 సంవత్సరాలు.
modi
mother
congress
raj babbar

More Telugu News