Yanamala: కుట్రతోనే సుజనా సంస్థలపై ఈడీ దాడులు...2019లో మోదీకి పరాభవం తప్పదు : మంత్రి యనమల

  • దేశానికి అన్యాయం చేస్తున్న మోదీని గద్దె దించడమే టీడీపీ ధ్యేయం
  • 2019లో ప్రధాని ఎవరన్నది నిర్ణయంలో బాబు అభిప్రాయం కీలకం
  • వైసీపీ, జనసేనలది కుర్చీ తాపత్రయం అని విమర్శ

తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగానే పార్టీ ఎంపీ సుజనా చౌదరి సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. దేశానికి, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీకి 2019లో జరిగే ఎన్నికల్లో తీవ్ర పరాభవం తప్పదని హెచ్చరించారు. నేడు ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మోదీని గద్దె దించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన అజెండా అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుందని జోస్యం చెప్పారు. ఇక, వైసీపీ, జనసేన గురించి చెప్పేదేమీ లేదని, రెండు పార్టీలదీ కుర్చీ యావ మాత్రమేనన్నారు.

More Telugu News