Tapsee: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఇస్రో ఉద్యోగి పాత్రలో తాప్సీ 
  • బన్నీ సినిమా జనవరికి వాయిదా
  • చరణ్ సినిమాకు పాట బ్యాలెన్స్ 

*  సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఇస్రో ఉద్యోగిగా కనిపించనుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'మిషన్ మంగళ' హిందీ చిత్రంలో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా తాప్సీ చెబుతూ, ఈ చిత్రం షూటింగ్ మొదలయిందని, ఇందులో తాను ఇస్రోకు చెందిన నేవిగేషన్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ ఉద్యోగిగా కనిపిస్తానని చెప్పింది.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే చిత్రం షూటింగ్ వాయిదా పడింది. వాస్తవానికి వచ్చే నెలలో ప్రారంభం కావలసిన ఈ చిత్రం షూటింగును జనవరి నెలకు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తికానందున ఈ వాయిదా జరిగినట్టు చెబుతున్నారు.
*  రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'వినయ విధేయ రామ' చిత్రం షూటింగుకు సంబంధించి ఇక ఒక పాట మాత్రం మిగిలివుంది. ఈ పాటను వచ్చే నెల 10 నుంచి హైదరాబాదులో లావిష్ గా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.

More Telugu News