Jagan: జగన్ మాటలు వింటుంటే.. కమెడియన్ రాజబాబు మాటలు గుర్తొస్తాయి: ఆదినారాయణ రెడ్డి

  • కత్తి దాడికి, నాకు సంబంధమేంటి?
  • ఆస్తులు బోగస్ అనడం హాస్యాస్పదం
  • తెలంగాణలో వైసీపీ కనుమరుగైంది

వైసీపీ అధినేత జగన్ మాటలు వింటుంటే తెలుగు సినిమా కమెడియన్ రాజబాబు మాటలు గుర్తొస్తాయని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కత్తి దాడికి, ఆదినారాయణ రెడ్డికి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. జగన్ చెప్పిన అబద్ధాలను పుస్తకం అచ్చు వేయిస్తే.. భారత, భాగవతాలను మించిన పెద్ద పుస్తకం తయారవుతుందన్నారు.

చంద్రబాబు కుటుంబ ఆస్తులు బోగస్ అనడం హాస్యాస్పదమని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. జగన్‌కి ఆస్తుల్లేవంటున్నారని.. అలాంటప్పుడు హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని ఇల్లు, బెంగుళూరులోని ఇల్లు ఎవరివని ప్రశ్నించారు. తెలంగాణలో వైసీపీ కనుమరుగైందని.. జనసేన పరిస్థితి ప్రజలందరికీ తెలిసిందేనని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News