Sonia Gandhi: ఓటేసినా ఫాంహౌస్ కే.. ఓటు వేయకపోయినా ఫాంహౌస్ కే!: కోదండరామ్

  • నాలుగున్నరేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదు
  • 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడం మన అదృష్టం
  • తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ ఎంతో సాహసం చేశారు
తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ ఎంతో సాహసం చేశారని టీజేఎస్ అధినేత కోదండరామ్ అన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ చేసిందేమీలేదని మండిపడ్డారు. 9 నెలల ముందే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేయడం మనం చేసుకున్న అదృష్టమని చెప్పారు. ముందే గద్దె దిగిన కేసీఆర్ కు ఓట్లు అడిగే అర్హత కూడా లేదని అన్నారు.

లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్... అందులో పావువంతు ఉద్యోగాలను కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ప్రజల కోసమే నిలబడతామని, ప్రజల కోసమే పని చేస్తామని అన్నారు. కేసీఆర్ కు ఓటేసినా ఫాంహౌస్ కే, ఓటు వేయకపోయినా ఫాంహౌస్ కే అని ఎద్దేవా చేశారు. 
Sonia Gandhi
kodandaram
kcr
tjs
congress
TRS
medchal

More Telugu News