Komatireddy Venkatareddy: ప్రజల తీర్పు కేసీఆర్‌కు ముందే అర్థమైంది: కోమటిరెడ్డి

  • తెలంగాణ ప్రజల కష్టాలు తీరలేదు
  • కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారు
  • అమరుల కుటుంబాలను ఆదుకోలేదు
100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఓడిపోతే ఫాం హౌస్‌కు పోతానంటున్నారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజుల ముందే ప్రజల తీర్పు కేసీఆర్‌కు అర్థమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల కష్టాలైతే తీరలేదు కానీ కేసీఆర్ మాత్రం వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

తమ పార్టీ మ్యానిఫెస్టోను కేసీఆర్ కాపీ కొడుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల తాలుకు కమిషన్ల సొమ్ము కేసీఆర్ వద్ద చాలా ఉందని.. ఎంత డబ్బు పంచినా గెలుపు మాత్రం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను తాను ప్రశ్నించినందుకే గతంలో అసెంబ్లీ నుంచి బహిష్కరించారని కోమటిరెడ్డి తెలిపారు. అమరుల కుటుంబాలను ఆదుకోలేదు సరికదా.. కనీసం స్థూపం నిర్మిస్తానన్న విషయాన్ని కూడా మరిచారని విమర్శించారు.
Komatireddy Venkatareddy
KCR
TRS
Telangana
Form House

More Telugu News