Pakistan: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి.. 35 మందికి గాయాలు

  • జుమా బజార్‌లో బాంబు దాడి
  • రద్దీని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భారీ పేలుడు సంభవించి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. హంగు ప్రాంతంలోని ఓరక్‌జాయ్‌ ప్రాంతంలో గల జుమా బజార్‌లో ప్రతి శుక్రవారం మార్కెట్ జరుగుతుంటుంది. ఇది చాలా రద్దీగా ఉంటుంది. దీనిని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడినట్టు భద్రతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. 35 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే బాంబు దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.
Pakistan
Zuma Bazar
Bomb Attack
Hospital
Police

More Telugu News