sonia gandhi: బేంగపేట విమానాశ్రయం చేరుకున్న సోనియాగాంధీ.. రాహుల్ గురించి వెయిటింగ్

  • ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
  • కాసేపట్లో బేగంపేట చేరుకోనున్న రాహుల్
  • అనంతరం అందరూ కలసి మేడ్చల్ బహిరంగసభకు పయనం
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ఆమె హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో ఆమెకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాతో పాటు, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ కూడా సోనియాకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. కాసేపట్లో మరో విమానంలో రాహుల్ గాంధీ బేగంపేట చేరుకోనున్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన... అక్కడి నుంచే హైదరాబాదుకు వస్తున్నారు. అనంతరం అందరూ కలసి మేడ్చల్ బహిరంగసభకు వెళతారు.
sonia gandhi
rahul gandhi
begumpet
hyderabad
congress

More Telugu News