nandamuri suhasini: నందమూరి సుహాసిని తీరుపై అసహనం.. కారెక్కిన కూకట్ పల్లి టీడీపీ నేత!

  • సుహాసిని పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన రంగారావు
  • కనీస సమాచారం కూడా ఇవ్వలేదంటూ అసహనం
  • కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిక
కూకట్ పల్లి నియోజకర్గం టీడీపీ నేత మాధవరం రంగారావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి కూకట్ పల్లి, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థులు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీలు కూడా హాజరయ్యారు.

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని పట్టించుకోకపోవడమే పార్టీకి రంగారావు గుడ్ బై చెప్పడానికి కారణమని సమాచారం. ప్రచారపర్వంలో దూరం పెడుతున్నారని, కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదని ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. గతంలో వివేకానందనగర్ కాలనీ టీడీపీ కార్పొరేటర్ గా ఆయన వ్యవహరించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి తన భార్యకు టికెట్ ఇప్పించుకున్నారు.
nandamuri suhasini
madhavaram rangarao
kukatpalli
TRS
Telugudesam
KTR

More Telugu News