kcr: నాయకులు వస్తుంటారు.. పోతుంటారు: కేసీఆర్

  • గత ప్రభుత్వాలకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గుర్తించండి
  • నాలుగైదేళ్లలో రైతులు ధనవంతులు కావాలి
  • కళ్యాణలక్ష్మిలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదు

దేశంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారని... ప్రజలు మాత్రం సరైన నాయకులను ఎన్నుకోవాలని చెప్పారు. నర్సంపేట బహిరంగసభలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఓటు వేయాలనేది ఓటర్లు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి ఏది మంచిది అనేది జనాలు నిర్ణయించుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వాలకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని అన్నారు.

విద్యుత్తు తలసరి వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని కేసీఆర్ తెలిపారు. రైతుబంధులాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు. కళ్యాణలక్ష్మిలాంటి పథకం వస్తుందని ఎవరూ కనీసం ఊహించలేకపోయారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇస్తున్న పింఛన్లను పెంచుతామని చెప్పారు. నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి కాబోతున్నాయని తెలిపారు. రైతాంగం నాలుగైదేళ్లలో ధనవంతులు కావాలని ఆకాంక్షించారు. మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీలు మీముందుకు వస్తున్నాయని... వారికి బుద్ధి చెప్పాలని కోరారు.

  • Loading...

More Telugu News