kodikathi: కోడికత్తి శ్రీనివాస్ రిమాండ్ పొడిగింపు.. కోర్టుకు చేరిన జగన్ షర్ట్!

  • శ్రీనివాస్ రిమాండ్ ను 14 రోజుల పాటు పొడిగించిన మేజిస్ట్రేట్
  • జగన్ షర్టును కోర్టుకు అందజేసిన లాయర్
  • సిట్ కు ఇవ్వరాదంటూ విన్నపం
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ కు కోర్టు రిమాండ్ ను పొడిగించింది. మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. శ్రీనివాస్ రిమాండ్ ఈ రోజు పూర్తికావడంతో... అతన్ని ఈరోజు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

మరోవైపు, దాడి జరిగిన రోజు జగన్ వేసుకున్న తెల్లరంగు షర్ట్ ఈరోజు కోర్టుకు చేరుకుంది. జగన్ తరపు న్యాయవాది ఆయన షర్టును కోర్టుకు అందజేశారు. సిట్ అధికారులకు షర్టును ఇవ్వరాదంటూ ఈ సందర్భంగా కోర్టును న్యాయవాది కోరారు. హైకోర్టులో రిట్ పిటిషన్ పై విచారణ జరిగేంత వరకు షర్టును సీల్డ్ కవర్ లో భద్రపరచాలని విన్నవించారు. న్యాయవాది ఫైల్ చేసిన మెమోను పరిశీలిస్తామని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ తెలిపారు.
kodikathi
jagan
srinivas
remand
shirt
YSRCP
stab

More Telugu News