varun tej: దిల్ రాజుకు వరుణ్ తేజ్ రిక్వెస్ట్

  • సంక్రాంతికి రానున్న 'ఎఫ్ 2'
  • అదే సమయంలో రానున్న చరణ్ మూవీ 
  • రిలీజ్ డేట్ మార్చమన్న వరుణ్ తేజ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ 'ఎఫ్ 2' సినిమా చేశాడు. పూర్తి వినోదభరితమైన మల్టీ స్టారర్ గా 'ఎఫ్ 2'ను మలిచారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందించిన 'వినయ విధేయ రామ' కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది.

చరణ్ సినిమాకి పోటీగా తన సినిమా రావడం వరుణ్ తేజ్ కి ఎంతమాత్రం ఇష్టం లేదట. మెగా అభిమానుల ఆదరణ పూర్తిగా పొందాలంటే కొంత గ్యాప్ తీసుకోవడం అవసరమనీ, 'ఎఫ్ 2'ను జనవరి 25వ తేదీన విడుదల చేయడం మంచిదని దిల్ రాజుతో చెప్పాడట. ఒక నిర్మాతగా దిల్ రాజు నిర్ణయం అనేక లావాదేవీలతో ముడిపడి వుంటుంది గనుక, ఇంకా ఆయన ఏమీ చెప్పలేదని తెలుస్తోంది. ఒకవేళ సంక్రాంతి బారి నుంచి 'ఎఫ్ 2' తప్పుకుంటే, 'మిస్టర్ మజ్ను' బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.  
varun tej
dil raju

More Telugu News