kalyan dev: రెండవ సినిమాకి సిద్ధమైన చిరూ చిన్నల్లుడు

  • కల్యాణ్ దేవ్ హీరోగా రెండవ సినిమా 
  • సంగీత దర్శకుడిగా తమన్
  • త్వరలో టైటిల్ ప్రకటన  
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ .. 'విజేత' సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు లుక్స్ పరంగా .. డాన్స్ పరంగా కల్యాణ్ దేవ్ కి మంచి మార్కులు ఇచ్చారు. చిరంజీవి సూచన మేరకు మంచి కథ కోసం కొంతకాలం గ్యాప్ తీసుకున్న కల్యాణ్ దేవ్, తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ దొరకడంతో రెండవ సినిమా కోసం రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు.

రిజ్వాన్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, పులి వాసు దర్శకత్వం వహించనున్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ రోజున ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేసుకుని, పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు కల్యాణ్ దేవ్ మరింత చేరువకావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       
kalyan dev

More Telugu News