Sharook Khan: 17 ఏళ్ల నాటి కోపం... షారూక్ కు ఒడిశా వాసుల బెదిరింపులు!

  • 2001లో వచ్చిన 'అశోక'
  • కళింగ సంస్కృతిని అవమానించారని విమర్శలు
  • క్షమాపణలు చెప్పకుండా రాష్ట్రానికి రావద్దంటున్న కళింగ సేన

ఓడిశా వాసులు బాలీవుడ్ బాద్షాపై తమకున్న 17 ఏళ్ల నాటి కోపాన్ని ఇంకా మరచిపోలేదు. మరో నాలుగు రోజుల్లో మెన్స్ హాకీ వరల్డ్ కప్ పోటీలు ఒడిశాలోని కళింగ మైదానంలో ప్రారంభం కానుండగా, దీనికి షారూక్ అతిథిగా హాజరు కానున్నారు. అయితే, తనకు క్షమాపణలు చెప్పకుండా షారూక్ వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్థానిక కళింగ సేన నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వారి కోపానికి కారణం ఏంటో తెలుసా?...

దాదాపు 17 సంవత్సరాల క్రితం... అంటే 2001లో కళింగ యుద్ధం నేపథ్యంలో షారూక్ హీరోగా 'అశోక' అన్న చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఒడిశా సంస్కృతికి వ్యతిరేకమని, ప్రజలను కించపరిచేలా ఉందని అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో చిత్రం వారం రోజులు కూడా నడవలేదు. అప్పటి కళింగ వాసుల ఆగ్రహం ఇప్పటికీ షారూక్ ను వెంటాడుతోంది. క్షమాపణలు చెప్పకుండా వస్తే, ఇంక్ చల్లుతామని, నల్ల జెండాలు ఎగరేస్తామని హెచ్చరిస్తూ, కళింగ సేన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.

More Telugu News