chaitu: 'మజిలి' నుంచి స్పెషల్ పోస్టర్

  • చైతూ కథానాయకుడిగా 'మజిలి'
  • చైతూ భార్య పాత్రలో సమంత 
  • దర్శకుడిగా శివ నిర్వాణ    

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'మజిలి' సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రీసెంట్ గా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 26వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నాగచైతన్య .. సమంత భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్లో వస్తోన్న 4వ సినిమా ఇది. ఈ రోజున నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇది 1980 నాటి కథా వస్తువుతో రూపొందుతోంది. అందువల్లనే ఈ పోస్టర్లో చైతూ స్కూటర్ పై కనిపిస్తున్నాడు. ఇంతవరకూ ఈ తరహా కథను గానీ .. పాత్రలను గాని చేయకపోవడం వల్లనే సమంత - చైతూ వెంటనే అంగీకరించారట. ఇద్దరికీ కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకం వుంది. ఈ జంటను మళ్లీ తెరపై చూడాలనే కుతూహలంతో అభిమానులు వున్నారు. వాళ్ల అంచనాలను అందుకోవాలనే పట్టుదలతో శివ నిర్వాణ వున్నాడు.  

  • Loading...

More Telugu News