KCR: తెలంగాణలో మహాకూటమిదే విజయం.. మహిళను సీఎంను చేయమని కోరతా: కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్

  • మహిళను సీఎంను చేయమని కోరతా
  • అధికారంలోకి వస్తే మహిళలకు పెద్ద పీట
  • కేసీఆర్ హయాంలో మహిళలకు భద్రత కరవు

తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరుతానని ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో మహిళలకు భద్రత కరవైందని ఆరోపించారు. అత్యాచారాల విషయంలో ఢిల్లీ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. తెలంగాణలో పీసీసీ మహిళా అధ్యక్షురాలికే టికెట్ ఇవ్వలేదు కదా? అన్న ప్రశ్నకు సుస్మిత బదులిస్తూ పార్టీలో వెయ్యి మంది వరకు మహిళా నేతలు ఉన్నారని, వారందరికీ టికెట్ ఇవ్వడమంటే కష్టం కదా అని సుస్మిత పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News