KCR: రూ.వేల కోట్లు సంపాదించుకుని రూ.1500 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు: జైపాల్ రెడ్డి విమర్శలు

  • కేసీఆర్ ప్రయత్నం విఫలమవుతుంది
  • కాంగ్రెస్ 80 సీట్లు గెలిచే అవకాశముంది
  • కేసీఆర్‌కు లోలోపల జంకుంది
1971లో ఇందిరాగాంధీ తప్ప ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ పార్టీ కూడా గెలవడం భారతదేశ చరిత్రలోనే లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వేల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని రూ.1000-1500 కోట్లు ఖర్చు పెట్టేందుకు కేసీఆర్ ముందుకు వచ్చారని.. కానీ ఈసారి ఆయన ప్రయత్నం విఫలమవుతుందన్నారు.

  మహాకూటమి కాకుండా ఒక్క కాంగ్రెస్సే 80 సీట్లు గెలిచే అవకాశముందన్నారు. నిశ్శబ్ద పవనాలు వీస్తున్నాయని.. కేసీఆర్‌కు లోలోపల జంకున్నదన్నారు. ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లానా? అని కేసీఆర్ భయపడుతున్నారని జైపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో పడదు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. గత నాలుగేళ్లుగా బీజేపీ సాయం పొందుతూ వచ్చారని ఆరోపించారు. ఈ పొత్తు వల్లనే బీజేపీ ప్రభావం కూడా తగ్గిపోయిందని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
KCR
Jaipal Reddy
Congress
BJP
Indira Gandhi

More Telugu News