nandamuri suhasini: నందమూరి సుహాసినికి నేను మద్దతిస్తున్నా: జగపతిబాబు

  • సుహాసిని ఎంతో నిజాయతీ కలిగిన వ్యక్తి
  • ప్రజలకు ఆమె సేవ చేస్తారని నేను నమ్ముతున్నా
  • సుహాసినిని అఖండ మెజార్టీతో గెలిపించాలి
కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆమె ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోవైపు, సుహాసినికి ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు మద్దతు ప్రకటించారు. సుహాసిని ఎంతో నిజాయతీ కలిగిన వ్యక్తి అని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. నియోజకవర్గ ప్రజలకు నిబద్ధతతో ఆమె సేవ చేస్తారని తాను నమ్ముతున్నానని చెప్పారు. కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలు ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 
nandamuri suhasini
jagapathi babu
kukatpalli
Telugudesam
tollywood
support

More Telugu News