dhanunjaya: 'భైరవగీత' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే

  • యాక్షన్ తో కూడిన ప్రేమకథా చిత్రం 
  • ధనుంజయ జోడీగా ఐరా 
  • ఈ నెల 30వ తేదీన విడుదల     

యాక్షన్ తో కూడిన ప్రేమకథా చిత్రంగా 'భైరవగీత' చిత్రం రూపొందింది. సిద్ధార్థ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఒక నిర్మాతగా భాస్కర్ వ్యవహరిస్తుండగా, మరో నిర్మాతగా రామ్ గోపాల్ వర్మ వున్నారు. ధనుంజయ - ఐరా జంటగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి సన్నాహాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ - దసపల్లా హోటల్లో రేపు రాత్రి 7:30 గంటల నుంచి ఈ వేడుక ఆరంభమవుతుంది. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలారు. పలువురు సినీప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి ఒక రోజు ముందుగా '2.ఓ' విడుదల కానుంది. వందల కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఆ సినిమాకి పోటీగా, చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన 'భైరవగీత'ను రంగంలోకి దింపుతుండటం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.    

More Telugu News