Andhra Pradesh: ఏపీ విభజన చట్టంలో చిన్న మార్పులు... గెజిట్ విడుదల చేసిన కేంద్రం!

  • విభజన చట్టంలో ముద్రణా లోపాలు
  • సరిచేసిన కేంద్ర న్యాయ శాఖ
  • అర్థం, నిబంధనలు మారవని వెల్లడి

2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో స్వల్ప మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ముద్రణా పరమైన లోపాలను మాత్రమే సవరించామని, దీనివల్ల అర్థంలోగానీ, నిబంధనల్లోగానీ ఎటువంటి మార్పూ ఉండబోదని కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది.

ఇక తాజా మార్పులను పరిశీలిస్తే, 52వ పేజీ 32వ లైన్ లోని '(బీ) ఆఫ్టర్ పార్ట్ 14'ను '(బీ) ఆఫ్టర్ పార్ట్ 12'గా చదువుకోవాలని, అదే పేజీలోని 33వ లైన్ లో ఉన్న 'పార్ట్ 14 తెలంగాణ' అన్న చోట 'పార్ట్ 13 తెలంగాణ' అని చదువుకోవాలని గెజిట్ లో ఉంది. కేవలం క్లరికల్ తప్పిదాలను గుర్తించి, వాటిని సరిచేసేందుకే చట్టాన్ని సవరించామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News