Patanjali: ‘పతంజలి’కి తగ్గిన ఆదరణ.. పడిపోయిన అమ్మకాలు

  • ప్రాభవం కోల్పోతున్న పతంజలి
  • దారుణంగా పడిపోతున్న అమ్మకాలు
  • ఐదేళ్లలో ఇదే తొలిసారి

పతంజలి.. ఈ పేరు తెలియని వారు ఉండరనడం అతిశయోక్తి కాదేమో. స్వదేశీ ఉత్పత్తుల పేరుతో మార్కెట్లోకి వచ్చిన పతంజలి ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌ను షేక్ చేసింది. అతి తక్కువ కాలంలో అమితాదరణ పొందిన పతంజలి ఉత్పత్తులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఫలితంగా ఎఫ్ఎంసీజీ మార్కెట్‌లో పతంజలి గణనీయమైన వాటాను సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుత పరిస్థితి మునుపటిలా లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఐదేళ్లలో తొలిసారి పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు దారుణంగా పడిపోయాయని పేర్కొన్నారు. పతంజలికి సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడంతోపాటు జీఎస్టీ దెబ్బతీసిందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి పతంజలి ఆదాయం పదిశాతం తగ్గి రూ. 8,148కోట్లకు పరిమితమైనట్టు తెలిపింది. 2013 తర్వాత ఇంత భారీ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారని పేర్కొంది. జీఎస్టీ, సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ అభిప్రాయపడింది.  

More Telugu News