rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఖగోళ శాస్త్రవేత్త పాత్రలో రకుల్ 
  • పోస్ట్ ప్రొడక్షన్ లో 'ప్రేమకథా చిత్రం' సీక్వెల్ 
  • బరువు పెంచేపనిలో నిత్యామీనన్

*  కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఖగోళ శాస్త్రవేత్త పాత్రను పోషించనుంది. శివకార్తికేయన్ హీరోగా రవికుమార్ దర్శకత్వంలో రూపొందే తమిళ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో రకుల్ నాయికగా నటిస్తోంది. ఇందులో ఆమె అలా ఖగోళ శాస్త్రవేత్త పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది.
*  సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న 'ప్రేమకథా చిత్రం 2' సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నూతన దర్శకుడు హరికిషన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేత, సిద్ధి ఇద్నాని హీరోయిన్లుగా నటించారు.
*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా 'ది ఐరన్ లేడి' చిత్రం రూపొందుతోంది. నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాత్ర పోషణ కోసం నిత్యామీనన్ మరింత బరువు పెరిగే పనిలో ప్రస్తుతం ఉంది.

More Telugu News