Chandrababu: రాజధాని నిర్మాణానికి 90 ఏళ్ల అవ్వ సాయం.. చంద్రబాబుకు పింఛను డబ్బులు ఇచ్చి ఆశీర్వాదం!

  • అమరావతి నిర్మాణానికి తనవంతు సాయం
  • రాముడు నీవెంటే ఉంటాడంటూ సీఎంకు ఆశీర్వాదం
  • ఉద్వేగానికి గురైన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఓ అవ్వ నుంచి ప్రేమ పూర్వక ఆశీర్వాదాలు అందాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి అహరహం శ్రమిస్తుస్తున్న చంద్రబాబుకు 90 ఏళ్ల అవ్వ అండగా నిలిచింది. తనకొచ్చిన పింఛను డబ్బులను రాజధాని నిర్మాణం కోసం అందించి ఉడతాభక్తి చాటుకుంది.

కృష్ణా జిల్లా చల్లపల్లిలో బుధవారం నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంను కలిసిన 90 ఏళ్ల కోగంటి చిత్రరేఖ తను దాచుకున్న రూ.12 వేల పింఛను డబ్బులను చంద్రబాబుకు అందించింది. అమరావతి నిర్మాణం కోసం తన వంతుసాయమని చెప్పడంతో చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారు. బాబు చేతిలో డబ్బులు పెట్టిన ఆమె రామరాజ్యం నీవల్లే సాధ్యమవుతుందని, రాముడు నీవెంటే ఉంటాడని భుజం తట్టి ఆశీర్వదించింది. అవ్వ ఔదార్యానికి కదిలిపోయిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
Chandrababu
Andhra Pradesh
Amaravathi
Koganti Chitra Rekha
Krishna District

More Telugu News