konda vishweshwar reddy: టీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదు.. 23న కాంగ్రెస్‌ లో చేరుతున్నా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • టీఆర్ఎస్‌కు ఇప్పుడు అందరూ వ్యతిరేకమే
  • నేడు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం
  • కాంగ్రెస్ తరపున తెలంగాణలో ప్రచారం
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ నెల 23న సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాతో బుధవారం సమావేశమైన అనంతరం ఆయనీ విషయాన్ని వెల్లడించారు.

 టీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదన్న ఆయన టీఆర్ఎస్‌కు ఒకప్పుడు మద్దతుదారులుగా ఉన్న యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, ఉపాధ్యాయులు ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టు చెప్పారు. నేడు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ మారేందుకు గల కారణాలను పూర్తిగా వివరిస్తానన్నారు.

కుంతియా మాట్లాడుతూ విశ్వేశ్వరర్ రెడ్డి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు. మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు పేర్కొన్నారు.
konda vishweshwar reddy
TRS
Congress
Telangana
Chevella
Rahul Gandhi

More Telugu News