Hyderabad: అనుమానాస్పద స్థితిలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బంధువు హరిహరరెడ్డి మృతి

  • మూడు రోజుల క్రితం మరణించిన హరిహరరెడ్డి
  • మృతదేహంలోని కొంత భాగాన్ని తినేసిన జంతువులు
  • పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ బంధువు ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బంధువు హరిహరరెడ్డి మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హరిహరరెడ్డి మరణించి మూడు రోజులవుతుందని ఓ అంచనాకు వచ్చారు. ఆయన మృతదేహంలోని కొంత భాగాన్ని పెంపుడు జంతువులు తినేశాయని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Dinesh Reddy
Harihara Reddy
Police
Postmartam

More Telugu News