Asaduddin Owaisi: ఒవైసీ ఒక రాజకీయ వ్యభిచారి.. ఎవరు డబ్బిస్తే.. వారి వద్దకు వెళతారు: బీజేపీ నేత కృష్ణసాగర్

  • టీఆర్ఎస్ నుంచి ఒవైసీ ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలి
  • కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో ఎవరు ఎక్కువ డబ్బిస్తే.. వారి వద్దకు వెళతారు
  • కారుకు పంక్చర్ కాబోతోందనే.. కొండా టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు రూ. 25 లక్షలు ఇవ్వజూపిందని ఒవైసీ ఆరోపించారని...  అసలు టీఆర్ఎస్ నుంచి ఆయన ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలతో కాపురం చేయడానికి ఎంఐఎం సిద్ధమయిందని... ఎవరు ఎక్కువ డబ్బిస్తే ఒవైసీ వాళ్ల దగ్గరకు వెళతారని విమర్శించారు. అసదుద్దీన్ ఒక రాజకీయ వ్యభిచారి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దేశ ద్రోహులను పెంచడంలో, మీడియా మీద ఆంక్షలు విధించడంలో, నేరాల పెరుగుదలలో, మద్యం అమ్మకాల్లో, అవినీతిలో, అబద్ధాలు చెప్పడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని కృష్ణసాగర్ విమర్శించారు. కాంగ్రెస్ ను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని... చంద్రబాబు ఇచ్చిన రూ. 500 కోట్లతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కారుకు పంక్చర్ కాబోతోందనే... కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు.
Asaduddin Owaisi
krishna sagar
bjp
congress
TRS
mim

More Telugu News