paruchuri: నేను సృష్టించిన పాత్ర అది .. అభిమానులు రక్తతిలకం దిద్దారు: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'మరో మలుపు' సినిమాను గురించి ప్రస్తావిస్తూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. "నేను బాగా రాయగలనని తెలుసుకున్న దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణగారు, 'మరో మలుపు'కి మరో వెర్షన్ రాయమన్నారు. అన్నయ్య రాసిన వెర్షన్ చదివాను. ఇది ఒక పేద బ్రాహ్మణుడి ఆకలి కథలా వుంది .. ఈ సినిమా ఎవరూ చూడరండి అని వేజెళ్ల గారితో చెప్పాను.

ఆయన ఆశ్చర్యపోయి .. 'అయితే ఇప్పుడు ఏం చేద్దాం' అన్నారు. అప్పుడు నేను ఒక పాత్రను సృష్టించాను. ఆ పాత్రను నేను పోషిస్తానంటే నేను పోషిస్తానని వేజెళ్ల .. అన్నయ్య .. శివకృష్ణ పోటీపడ్డారు. ఆ సమయంలో సాధించాననే సంతృప్తిని నేను పొందాను. నిర్మాత కనుక శివకృష్ణ నేను సృష్టించిన పాత్రను తనే పోషించాడు. ఆ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా చూసినవాళ్లు శివకృష్ణకి రక్తతిలకం దిద్దారు" అని చెప్పుకొచ్చారు.  
Go Back to Shorts
paruchuri
shivakrishna

More Telugu News