కడప జిల్లాలో టెన్షన్, టెన్షన్.. అవినాశ్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతల హౌస్ అరెస్ట్!
- వైసీపీలో నేడు చేరనున్న టీడీపీ నేతలు
- జమ్మలమడుగులో కార్యక్రమం ఏర్పాటు
- వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
వైసీపీ నేతలు అక్కడికి వెళితే ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాబల్యమున్న గ్రామం కావడంతోనే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. తాము శాంతియుతంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా అధికారులు హౌస్ అరెస్ట్ చేశారని వాపోయారు.