Uttar Pradesh: కట్నం కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. అర్ధాంగి నాలుక కోసిన భర్త

  • కాన్పూరులో ఘోరం
  • నిందితుడిని తప్పించే ప్రయత్నం
  • ఎస్ఎస్పీ ఆదేశాలతో అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘోరం జరిగింది. కట్నం కోసం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ పెద్దదైంది. చివరికి కోపం పట్టలేని భర్త కత్తితో భార్య నాలుకను కోసి పడేశాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండడంతో కేసును కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనకు పది రోజుల ముందు నుంచే బాధితురాలిని నిందితుడు ఇంట్లో బంధించాడని, విషయం తెలిసి తండ్రి వెళ్లి ఆమెను విడిపించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆకాశ్‌పై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

ఫిర్యాదు చేసినా నిందితుడిని అరెస్ట్ చేయలేదని, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. దీంతో సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ స్పందించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
Uttar Pradesh
Kanpur
Tongue
kinife
Wife
Husband

More Telugu News