renu desai: వచ్చే నెలలో నా కవితల సంకలనం పుస్తకం విడుదల చేస్తా: సినీ నటి రేణూదేశాయ్

  • ఈ సంకలనంలో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో కవితలు  
  • మొత్తం 31 కవితలు రాశాను
  • కొన్ని కవితలను అనంత శ్రీరామ్ అనువదించారు

తన కవితల సంకలనం పుస్తకాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తున్నట్టు  ప్రముఖ నటి రేణూ దేశాయ్ వెల్లడించారు. ‘యూట్యూట్’కు చెందిన ఓ ఛానెల్ లో ‘లైవ్’ లో ఆమె మాట్లాడుతూ, తన కవితల సంకలనం పుస్తకం విడుదల చేస్తానని పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది అభిమానులు ఈ పుస్తకం గురించి అడుగుతున్నారని అన్నారు.

 ఈ పుస్తకంలో తాను రాసిన 31 కవితలు ఉన్నాయని చెప్పారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఈ కవితలు ఉన్నాయని, ఇందులో 15 కవితలను తెలుగులోకి అనంత శ్రీరామ్ ట్రాన్స్ లేట్ చేశారని చెప్పారు. తన వివాహం గురించి, తమ పిల్లలు అకీరా, ఆదిత్య గురించి ప్రశ్నలు అడగొద్దని, ఈ విషయాలను ప్రస్తావించేందుకు మరోసారి మాట్లాడతానని అన్నారు.

ఈ సందర్భంగా ‘రకరకాల జ్ఞాపకాలు’ కవితను ఆమె చదివి వినిపించారు. ఈ కవితను గత డిసెంబర్ లో రాశానని, దీనిని తెలుగులోకి అనంత్ శ్రీరామ్ అనువదించారని అన్నారు. ఈ పుస్తకం కోసం ప్రీ-ఆర్డర్ చేస్తే దానిపై తన సంతకం చేసి పంపిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లోని వ్యక్తులు కొందరు తమ సొంత పేర్లకు బదులు, హీరోహీరోయిన్ల పేర్లను పెట్టుకుంటున్నారని, తల్లిదండ్రులు పెట్టిన పేర్లను పక్కనపెట్టి ఈ విధంగా చేయడమెందుకని ప్రశ్నించారు.

More Telugu News