Hyderabad: రేపటి నుంచి హైదరాబాదును చుట్టేయనున్న కేటీఆర్!

  • రేపట్నుంచి 29వ తేదీ వరకు కేటీఆర్ రోడ్ షోలు
  • 24న జూబ్లీహిల్స్, సనత్ నగర్ లలో రోడ్ షో
  • 26న కూకట్ పల్లి నియోజకవర్గం
హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి టీఆర్ఎస్ ప్రచారం మరింత ఊపందుకోబోతోంది. మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరాన్ని చుట్టేయనున్నారు. రేపటి నుంచి నగరంలో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోడ్ షోకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే సిద్ధమైంది. ఆ వివరాలు ఇవే.

  • 21వ తేదీ: మల్కాజ్ గిరి నియోజకవర్గం
  • 22వ తేదీ: ఎల్బీ నగర్, మహేశ్వరం
  • 23వ తేదీ: సికింద్రాబాద్, కంటోన్మెంట్
  • 24వ తేదీ: జూబ్లీహిల్స్, సనత్ నగర్
  • 26వ తేదీ: కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్
  • 27వ తేదీ: ఖైరతాబాద్, గోషామహల్
  • 28వ తేదీ: పటాన్ చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్
  • 29వ తేదీ: అంబర్ పేట, ముషీరాబాద్.
Hyderabad
KTR
road show
TRS

More Telugu News