shankar rao: నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నా: కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు

  • శంకర్ రావుకు దక్కని కాంగ్రెస్ టికెట్
  • ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన సీనియర్ నేత
  • మహాకూటమి గెలుపుకు కృషి చేస్తానని తాజా ప్రకటన
తనకు కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నేత శంకర్ రావు ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, షాద్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ శంకర్ రావుకు బీఫామ్ ఇచ్చినట్టు కూడా సమాచారం. అయితే, ఊహించని విధంగా తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ, మహాకూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. 
shankar rao
congress
independent
nomination

More Telugu News