Vijay: రామ్ చరణ్ 'రంగస్థలం' రికార్డును తిరగరాసిన విజయ్ 'సర్కార్'!

  • రెండు వారాల్లోనే రూ. 225 కోట్ల గ్రాస్
  • 'రంగస్థలం' వసూళ్లు రూ. 218 కోట్లే
  • మరిన్ని రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్
తొలుత మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా దూసుకెళుతున్న విజయ్ కొత్త చిత్రం 'సర్కార్' ఈ సంవత్సరం విడుదలైన రామ్ చరణ్ 'రంగస్థలం' నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది. రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ ను సాధించిన 'సర్కార్' రెండు వారాల్లో రూ. 225 కోట్ల గ్రాస్ ను అధిగమించింది. దీంతో ఈ సంవత్సరం సౌతిండియాలో రెండు వారాల్లోనే అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకూ ఈ రికార్డు రెండు వారాల్లో రూ. 218 కోట్లు వసూలు చేసిన 'రంగస్థలం' పేరిట ఉంది. మూడో వారంలోనూ 'సర్కార్' కలెక్షన్ల విషయంలో దూకుడుగానే ఉండటంతో మరిన్ని రికార్డులు బద్దలవుతాయని విజయ్ అభిమానులు భావిస్తున్నారు.
Vijay
Sarkar
Rangasthalam
Collections
Ramcharan

More Telugu News