భర్తతో కలసి రూ. 4కే భోజనాన్ని రుచిచూస్తున్న రోజా... ఫోటోలు!

  • నగరిలో ఏర్పాటైన క్యాంటీన్
  • భర్తతో కలసి భోజనం చేసిన రోజా
  • మరిన్ని క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తామని వెల్లడి
ఇటీవల రోజా చారిటబుల్ ట్రస్ట్ తరఫున వైఎస్ఆర్ క్యాంటీన్ ను ప్రారంభించిన నగరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా, ఆ భోజనాన్ని రుచి చూశారు. నగరిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్ కు వచ్చిన ఆమె, పేదలకు స్వయంగా భోజనాన్ని అందించారు. ఆపై తన భర్త సెల్వమణితో కలసి ఆమె భోజనం చేశారు. పేదలకు తక్కువ ధరకు భోజనాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఈ క్యాంటీన్ ను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ క్యాంటీన్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు ఆర్కే రోజా తెలిపారు.
Go Back to Shorts
Nagari
Roja
Selvamani
YSR Canteen

More Telugu News