నాడు కొడుకు కోసం అమ్మ, నేడు అమ్మ కోసం కొడుకు... సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ ల త్యాగం!
- 2014లో కార్తీక్ కోసం మహేశ్వరం సీటును త్యాగం చేసిన సబిత
- ఈ ఎన్నికల్లో తొలుత ఇద్దరికీ సీటు లభిస్తుందన్న ఆశాభావం
- పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ టీడీపీకి
- తల్లికోసం రాజీనామా నిర్ణయం వెనక్కు తీసుకున్న కార్తీక్
2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇస్తామని స్పష్టం చేయగా, చేవెళ్ల ఎంపీగా కార్తీక్ ను నిలిపేందుకు, తన సీటును సబిత త్యాగం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం శ్రమించినా, ఆ ఎన్నికల్లో కార్తీక్ రెడ్డి గెలవలేదు. ఈ దఫా తొలుత ఇద్దరికీ టికెట్ లభిస్తుందని భావించినా, మహా కూటమి ఏర్పడటంతో ఒక సీటును వదులుకోక తప్పలేదు.