vishal: 'అయోగ్య' ఫస్టులుక్ తో అదరగొట్టేస్తోన్న విశాల్

  • 'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య'
  • పోలీస్ ఆఫీసర్ గా విశాల్ 
  • కథానాయికగా రాశి ఖన్నా     

ఎన్టీఆర్ నటనను కొత్త కోణంలో ఆవిష్కరించిన సినిమాగా 'టెంపర్'గురించి చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. ఈ సినిమా కంటెంట్ లోని కొత్తదనం కారణంగా వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ లో విశాల్ హీరోగా చేస్తున్నాడు. 'అయోగ్య' టైటిల్ తో ఈ సినిమాను వెంకట్ మోహన్ రూపొందిస్తున్నాడు.

ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ ను విడుదల చేశారు. పోలీస్ జీప్ కి ఆనుకుని స్టైల్ గా నుంచున్న విశాల్ లుక్ ఆకట్టుకుంటోంది. తమిళనాట మాస్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ కథ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన వరుస విజయాలు కూడా ఈ సినిమాపై క్రేజ్ ను పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఆయన సరసన రాశి ఖన్నా కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News