balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ తదుపరి షెడ్యూల్లో ఎస్వీఆర్

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్ 
  • ముఖ్యపాత్రల్లో రకుల్ .. తమన్నా .. నిత్యా 
  • జనవరి 9వ తేదీన విడుదల       
ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. మొదటిభాగంగా రానున్న 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే చాలా కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఎన్టీఆర్ నటించిన చాలా చిత్రాలలో ఎస్వీ రంగారావు కూడా నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో ఆణిముత్యాల వంటి సినిమాలు వచ్చాయి.

అందువలన 'కథానాయకుడు'లో ఎస్వీఆర్ పాత్రను కూడా చూపించవలసి వుంది. అచ్చు ఎస్వీఆర్ లానే కనిపించే ఒక థియేటర్ ఆర్టిస్ట్ వున్నాడట. ఎస్వీఆర్ పాత్ర కోసం ఆయనను ఎంపిక చేసినట్టుగా సమాచారం. తదుపరి షెడ్యూల్లో ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. శ్రీదేవిలా రకుల్ .. జయప్రదగా తమన్నా .. సావిత్రిలా నిత్యామీనన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. జనవరి 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.     
balakrishna
rakul
thamannah
nithya

More Telugu News