Nadendla manohar: జనసేన నేత నాదెండ్ల మనోహర్ కారును ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం!

  • జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో ఘటన
  • వెనక నుంచి వచ్చి ఢీకొట్టిన లారీ
  • దెబ్బతిన్న కారు

జనసేన నేత నాదెండ్ల మనోహర్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. అయితే, మనోహర్‌కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 15న మనోహర్ మాదాపూర్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో హెరిటేజ్ వద్ద కారు టర్న్ తీసుకుంటుండగా, వెనక నుంచి వచ్చిన లారీ మనోహర్ కారును ఢీకొట్టింది. కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే, కారులో ఉన్న మనోహర్‌కు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. మనోహర్ కారు డ్రైవర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News