KTR: కేటీఆర్ కు రూ. 33.28 లక్షల అప్పు.. ఆయన భార్యకు రూ. 27.39 కోట్ల అప్పులు!

  • కేటీఆర్ పేరుపై రూ. 1.30 కోట్ల స్థిరాస్తులు, రూ. 3.63 కోట్ల చరాస్తులు
  • ఆయన భార్య పేరుపై రూ. 8.98 కోట్ల స్థిరాస్తులు, రూ. 27.70 కోట్ల చరాస్తులు
  • అఫిడవిట్ లో వెల్లడించిన కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన అఫిడవిట్ సమర్పించారు. అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. రూ. 1.30 కోట్ల స్థిరాస్తులు, రూ. 3.63 కోట్ల చరాస్తులు తన పేరుపై ఉన్నాయని అఫిడవిట్ లో కేటీఆర్ పేర్కొన్నారు.

తన భార్య పేరు మీద రూ. 8.98 కోట్ల స్థిరాస్తి, రూ. 27.70 కోట్ల చరాస్తులు ఉన్నాయని చెప్పారు. తనకు రూ. 33.28 లక్షల అప్పు, తన భార్య పేరు మీద రూ. 27.39 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. తన చేతిలో రూ. 1,42,594... తన భార్య చేతిలో రూ. 1,08,231 నగదు ఉందని పేర్కొన్నారు. తనకు ఇన్నోవా కారు ఉందని తెలిపారు. 16 కేసులు తనపై ఉన్నాయని వెల్లడించారు.
KTR
assets
debts
affidavit
cases
cash in hand

More Telugu News